కేశూభాయ్ ఉద్వాసన ఖాయం
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ ఉద్వాసనకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకత్వం రంగం సిద్ధం చేసింది. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు బిజెపి కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
కేశూభాయ్ పటేల్‌ను ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఢిల్లీకి పిలిపించి ఆయనతో మాట్లాడారు.
ఆదివారం రెండు గంటల పాటు జరిగిన బిజెపి ఉన్నతస్థాయి సమావేశంలో కేశూభాయ్ వారసుడ్ని ఎంపిక చేసేవిషయమై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, హోం మంత్రి ఎల్.కె. అద్వానీ, బిజెపి అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు మదన్‌లాల్ ఖురానా, గుజరాత్ ఇన్‌చార్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర మోడి పాల్గొన్నారు.
గుజరాత్ నాయకత్వ మార్పిడి గురించి చర్యలు చేపెట్టేందుకు జనా కృష్ణమూర్తి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఒకదాన్ని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. కొత్త ముఖ్యమంత్రిఎంపికపై రాష్ట్ర నాయకులతో ఈ కమిటీ విస్తృత చర్చలు జరుపుతుంది.












Click it and Unblock the Notifications