కేశూభాయ్ వారసుడు మోడి?
న్యూఢిల్లీః అధిష్టాన వర్గం ఆదేశంతో గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. కేశూభాయ్ రాజీనామా ఖాయమని గత కొద్దిరోజులు వార్తలు వస్తున్న నేపథ్యంలో అధిష్టాన వర్గం సోమవారం నాడు ఆయన్ను పిలిపించి మాట్లాడింది. అగ్రనేతలతో మంతనాల తర్వాత ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఇటీవల జరిగిన గుజరాత్‌అసెంబ్లీ ఉపఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం, భూకంపం బాధితులను ఆదుకునేవిషయంలో సమర్ధంగా వ్యవహరించలేదన్న ఆరోపణలు ఆయన పదవిని బలిగొన్నట్టుగా చెబుతున్నారు. కాగా కేశూభాయ్ వారసుని కోసం బిజెపి కేంద్ర నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర మోడిపేరు ప్రధానంగా వినవస్తున్నది.
మోడికి ప్రధాని వాజ్‌పేయి, హోం మంత్రి ఎల్‌కె అద్వానీ, పార్టీ అధ్యక్షుడు జనా కృష్ణమూర్తిఆశిస్సులు వున్నాయని అంటున్నారు. అగ్రనేతలంతా సుముఖంగా వున్నకారణంగా మోడినే గుజరాత్‌పీఠం వరించడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. అయితే స్థానికంగా అసమ్మతి తలెత్తకుండా, అధిష్టానం మోడిని తమపై రుద్దిందన్న అభిప్రాయం గుజరాత్ పార్టీలో కలగకుండా అగ్రనేతలు కసరత్తు జరుపుతున్నారని వారుఅంటున్నారు.












Click it and Unblock the Notifications