లాడెన్ అప్పగింతే పరిష్కారం: ముషారఫ్
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్‌ను అప్పగించడమే సమస్యకు పరిష్కారమని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ అన్నారు. లాడెన్ అప్పగించాలని ఆయన తాలిబాన్‌కు మరోసారివిజ్ఞప్తి చేశారు. అమెరికాకు సహాయం చేయడం వల్ల తమకు కష్టాలు ఎదురవుతున్న మాట వాస్తవమేనని ఆయనఅంగీకరించారు. అమెరికా, బ్రిటన్ దళాలు అఎn్ఘానిస్థాన్‌లో ప్రవేశించినట్లు తనకు తెలియదని ఆయన అన్నారు.
అఎn్ఘానిస్థాన్‌తో తమ దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని,అఎn్ఘానిస్థాన్ మిత్రదేశం తమదొక్కటేనని ఆయన అన్నారు. తన ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ చర్యలు తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే వున్నాయని ఆయన చెప్పారు.
మదరాసాలో తీవ్రవాదులున్నారనే వార్తలను ఆయన ఖండించారు. మదరసాలపై రాజకీయ, మతపెద్దల ప్రభావం వుంటే వుండవచ్చు గానీ తీవ్రవాదులు లేరని ఆయనచెప్పారు. ఒక వేళ వుంటే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మదరసాలలో తీవ్రవాదం బోధిస్తూ వుంటే కూడా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.అఎn్ఘానిస్తాన్‌లో ప్రతిపక్షాలు ఏకమైతే తాలిబాన్‌కు గడ్డు రోజులు తప్పవని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వానికి ముప్పు తప్పదని ప్రతిపక్ష నాయకురాలు బెనజీర్ భుట్టో లండన్‌లో అన్నారు. తాలిబాన్ మద్దతుదారులు ముషారఫ్ ప్రభుత్వంపై తిరగబడే ప్రమాదం ఉన్నదని ఆయన ఆమె అన్నారు. ఒసామాబిన్ లాడెన్ వద్ద 12 వేల మందితో కూడినసైన్యం వున్నదని, వివిధ దేశాలకు చెందిన వారు ఈసైన్యంలో వున్నారని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications