ఉగ్రవాదులకు వినాశకాలం
న్యూఢిల్లీః దేశ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా ఉగ్రవాద మూకలు ఏకంగా అసెంబ్లీమీదనే దాడి చేసిన సంఘటన దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ప్రధాని వాజ్‌పేయి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదలకు వినాశకాలం దాపురించిందని ఆయన అన్నారు.
అమెరికా కాశ్మీర్‌లో ఏం జరుగుతున్నదో గుర్తించి పాకిస్తాన్ దన్నుగా వున్న తీవ్రవాదంపై కూడా గురిని ఎక్కుపెట్టాలని ప్రధానికోరారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఈ దాడులను తీవ్రంగా ఖండించి తీవ్రవాదులకు ఊతం ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని అన్నారు.అసెంబ్లీపై దాడిలో పాల్గొన్న ముగ్గురు తీవ్రవాదులను పోలీసులు కాల్చిచంపినట్టుగా ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications