పిడుగుపాటుః ప్రధాని

న్యూఢిల్లీః కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, గ్వాలియర్‌ మహారాజ మాధవరావు సింధియా ఆకస్మిత మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం అవుతున్నది. దివంగత నేత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు, సింధియా భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో అగ్రశ్రేణి నేతలు సఫ్దర్‌జంగ్‌ రోడ్‌లోని ఆయన ఇంటికి వెల్లువలా తరలి వస్తున్నారు.

రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌, ప్రధాని వాజ్‌పేయి, కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ, మాజీ ప్రధానులు చంద్రశేఖర్‌, ఐకె గుజ్రాల్‌ కేంద్రమంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యులు సోమవారం నాడు సింధియా భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులుఅర్పించారు. ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానలు ప్రవాహంలా కదలివచ్చి సింధియాకు నివాళు లర్పిస్తున్నారు. ప్రమాద స్ధలం నుంచి సింధియా భౌతికకాయాన్ని సోమవారం ఉదయమే ఢిల్లీ తీసుకువచ్చారు.

ప్రత్యేకవిమానంలో మంగళవారం నాడు ఆయన భౌతికకాయాన్నిగ్వాలియర్‌ తరలిస్తున్నారు. గ్వాలియర్‌లో బుధవారం నాడు అంత్యక్రియలు జరుగుతాయి. సింధియా మరణంతో ప్రధాని వాజ్‌పేయి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ వార్త తనకు పిడుగుపాటులా వున్నదనిపేర్కొంటు ప్రముఖుల సంతాపాల రిజిస్టర్‌లో ప్రధానిస్వహస్తాలతో రాశారు. ఇది పిడుగుపాటు. విధి ఇంత క్రూరంగా వుంటుందా అని ప్రధానిఅందులో రాశారు. తన కుమార్తె నమితతో పాటు వాజ్‌పేయి సింధియా ఇంటికి వచ్చారు. సింధియా కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+