వర్షాలతో మోదం, ఖేదం
హైదరాబాద్‌ః రాష్ట్రాన్ని గత వారం రోజులుగా ముంచెత్తుతున్న భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మోదానికి మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఖేదానికి కారణమయ్యాయి. నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం ఏడుగురుని బలితీసుకున్నది.
జిల్లాలో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. పంటలు నాశనం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ అనేక గ్రామాలను జలమయం చేశాయి. మిర్యాలగూడ వంటి ప్రధాన కేంద్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వేలాది ఎకరాలు మునిగిపోయాయి. అనేక గ్రామాలు జలమయమయ్యాయి. కాగా రాయలసీమ, తెలంగాణాలోని కొన్ని మెట్ట ప్రాంతాలకు ఈ వర్షాలు హర్షం తెచ్చాయని రైతులకు లాభం కలిగించాయనిఅంటున్నారు. ముఖ్యంగా పత్తి, వేరుశెనగ రైతులకు ఆలస్యంగానైనా వచ్చిన ఈ వర్షాలు తగిన ప్రతిఫలాన్నిఅందిస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జంటనగరాలకు తాగునీరుఅందించే జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications