భారీ వర్షాలు- 11మంది మృతి

హైదరాబాద్‌: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 11 మంది మరణించగా, ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. గుంటూరు జిల్లా రెంట చింతల మండలంలో గోలివాడు దాటుతూ కొత్తవిజయకుమార్‌ (16), బత్తుల కోటమ్మ (55) మరణించినట్లు గుంటూరు నుంచిఅందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.
నల్లగొండ జిల్లాలో ఎనమండుగురు మరణించగా, ఒకరు గల్లంతయ్యారు. హుజూర్‌నగర్‌ మండలంలోని గోపాలపురం, బూరగడ్డల మధ్య నల్లచెర్వు ప్రవాహంలో రాయపూడివీరబాబు (18) కొట్టుకుపోయి మరణించాడు. నూతనకల్‌ మండలం బిక్కుమళ్ల శివారులోని పాలేరు వాగులో మనిగిపోయి ఎ. ప్రవీణ్‌ (12), వనంవీరన్న (10) మరణించారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ గ్రామం గూనలబావిలో పడ్డ మోటారు పంపుసెట్‌ను తీయడానికి బావిలోకి దిగిన ఎడ్ల శ్రీనివాస్‌ (30), ఎడ్ల దయాకర్‌ (25) మరణించారు.వీరిద్దరిని రక్షించడానికి బావిలోకి దిగిన గోటిఅంజయ్య (30) కూడా చనిపోయాడు. మృతదేహాలను వెలికి తీయడానికి బావిలోకి దిగిన కేతేపల్లి పోలీసుస్టేషన్‌ జవాను యోహాన్‌ (30) కూడా మరణించాడు. దేవరకొండ మండలం మైనంపల్లి వాడులో చేపలు పట్టడానికి వెళ్లిన నేనావత్‌ శుక్రు (36) ప్రమాదవశాత్తు వరదలో కొట్టుకుపోయి మరణించాడు. నార్కెట్‌పల్లి మండలంగోప్లాయిపల్లిలో ఒక వ్యక్తి గల్లంతయినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ నగరంలోని ఎల్లారెడ్డిగుడాలో భారీ వర్షానికి కరెంట్‌ స్తంభం కూలిమీద పడటంతో ముప్పయి యేళ్ల గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్‌లో కొన్ని కాలనీలు నీట మునిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+