పోరు తప్ప మార్గం లేదు: అమెరికా
వాషింగ్టన్: ఉగ్రవాదులపై పోరు తప్ప మరో మార్గం లేదని అమెరికా స్పష్టం చేసింది. తాలిబాన్లను నమ్మబోమని అన్నది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ తమ వద్దనే వున్నాడని, అయితే లాడెన్‌నుఅప్పగించబోమని తాలిబాన్ చేసిన ప్రకటన అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. లాడన్‌నుఅప్పగించబోమంటూనే చర్చలకు సిద్ధమని తాలిబాన్ ప్రకటించడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది.
ఉగ్రవాదులపై కోఆవర్టు ఆపరేషన్‌కు అమెరికా అధ్యక్షుడు బుష్ ఆమోదం తెలియజేసినట్లు ఆమెరికా పత్రిక ఒకటి రాసింది. తీవ్రవాదాన్ని, దానికి ఊతం ఇస్తున్నవారిని నిర్వీర్యం చేస్తామని అమెరికా ప్రకటించింది.సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన దాడులను దృష్టిలో వుంచుకుని అటువంటి దాడులు పునరావృతం కాకుండా అమెరికా గట్టి చర్యలు తీసుకుంటోంది. భద్రతా వ్యవస్థను, నిఘాను పటిష్టం చేసుకుంది.
ఇదిలావుంటే, అఎn్ఘానిస్థాన్‌లో ఒసామా బిన్ లాడెన్ ఆచూకీపై నార్తర్న్ అలయెన్స్ కూడా దృష్టిపెట్టింది. తాము లాడెన్‌ను కొద్ది రోజుల క్రితం చూసినట్లు నార్తర్న్ అలయెన్స్ నేత ఒకరు చెప్పారు. ముల్లా మహ్మద్ ఒమర్ కూడా లాడెన్‌తో పాటే వుంటున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications