మొహరించిన అమెరికా బలాలు
న్యూఢిల్లీః అఎn్గానిస్తాన్‌పై ఏ క్షణంలోనైనా అమెరికా దాని మిత్రపక్షాల దాడులు ప్రారంభమయ్యే అవకాశం వున్నది. గల్ఫ్‌లో అమెరికా, బ్రిటన్‌కు చెందిన 40 యుద్ధనౌకలను మొహరించారు. జపాన్ యుద్ధ నౌక కూడా కదలివచ్చింది. మరోవైపు వైమానిక దాడులకు వీలుగా అమెరికా గుర్తించిన సరిహద్దుల్లోని వైమానిక స్థావరాలను పాకిస్తాన్ ఖాళీ చేసింది.
అయితే ఈ స్థావరాలను ఐక్యరాజ్యసమితి సహాయ చర్యలకోసం ఖాళీ చేశామని అమెరికా కోసం కాదని పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ ప్రకటించారు. అయితే అమెరికాసైనిక బృందాలు, యుద్ధవిమానాలు ఈ స్థావరాలకు చేరుతున్నట్టుగా తెలిసింది. మరో వైపు తాలిబన్‌సేనానుల్లో కొందరినైనా తమకు అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నంలో అమెరికా వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
కోవర్ట్ ఆపరేషన్స్‌కు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నుంచి గ్రీన్ సిగ్నల్‌అందినట్టుగా చెబుతున్నారు. అఎn్గాన్లు కూడా అమెరికా సవాలును ఎదుర్కునేందుకు తమ బలాలను సరిహద్దుల్లో మొహరించారు. బలవంతంగాసైన్యంలోకి తీసుకున్న యువకులను వివిధ దేశాలనుంచి పారిపోయి వచ్చి ఆశ్రయం తీసుకుంటున్న నేరగాళ్లను సాయుధం చేసి సరిహద్దుల్లోకి తరలిస్తున్నారు. మరో వైపు తాలిబన్ల వైరి వర్గాల నేతలు రోమ్‌లో సమావేశమై ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా వున్నట్టుగా ప్రకటించారు. అయితే తమ ప్రభుత్వాన్ని కూల్చివేయడం ఎవరి తరం కాదని ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ప్రళయం సృష్టిస్తామని తాలిబన్లు హుంకరిస్తున్నారు. తాలిబన్లు తమ దేశంలో ఏలాంటి ఉపద్రవం సృష్టిస్తారోనన్న భయం పాకిస్తాన్ పాలకుల్లో కూడా కనిపిస్తున్నది.












Click it and Unblock the Notifications