ప్రతికూల వాతావరణం వల్లనే ప్రమాదం
లక్నో: ప్రతికూల వాతావరణం వల్లనే కాంగ్రెస్‌సీనియర్ నాయకుడు మాధవరావు సింధియా, మరో ఏడుగురు ప్రయాణిస్తున్నవిమానం కూలిపోయిందని ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపల్‌సెక్రటరీ (పౌర విమానయానం) శశాంక్ శేఖర్ సింగ్ చెప్పారు. సింగ్ మూడు దశాబ్దాల పాటుపైలట్‌గా పని చేశారు. పూర్తిగా వాతావరణం ప్రతికూలించడంతోపైలట్ నియంత్రణ కోల్పోయి వుంటాడని, దీంతోవిమానం కూలిపోయి వుంటుందని ఆయన సోమవారం అన్నారు.విమాన ప్రమాదాని చెప్తున్న వివిధ కారణాలను ఆయన ఖండించారు.
మధ్యలోవిమానంలో మంటలు పుట్టి వుంటాయని, పైలట్‌కు ఈవిషయం తెలియకపోయి వుండవచ్చునని అంటున్న మాటలు తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని,విమానంలోని ఏ మూలన మంటలు పుట్టినా కాక్‌పిట్‌లో కనిపిస్తుందని, వెంటనేపైలట్ గ్రౌండ్ కంట్రోల్‌కు ఎస్‌ఒఎస్ పంపుతాడని, ఈవిమానం విషయంలో అది జరగలేదని ఆయన అన్నారు.
ఫైటర్ విమానాలకు మాత్రమే ఎజెక్టర్ చైర్స్ లేదా పారాచూట్స్ సౌకర్యాలు వుంటాయని, పౌరవిమానాలకు ఈ సౌకర్యాలు వుండవని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications