విశాఖలో పేలిన బాంబు- ఇద్దరు మృతి
విశాఖపట్నం: గాజువాక దయాళ్ నగర్‌లోని ఒక ఇంట్లో మంగళవారం సాయంత్రం హటాత్తుగా బాంబు పేలడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ఒక మహిళస్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. గాజువాక దయాళ్‌నగర్‌లోని గండి దేవుడు ఇంటిలో
సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సాయంత్రం గంటి దేవుడి ఇంట్లో టీవీ చూస్తున్నారు. టివీ వున్న గదిలోని ఒక మూల నుంచి హటాత్తుగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో దేవుడి ఇంటి ప్రాంతమంతా కకావికలమైంది. టీవి ముందు కూర్చున్న గండినాయుడు, గుదే ఈశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. చిన్ని కృష్ణ, ఎరుకలమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications