భారత్ కు టోనీబ్లెయిర్ బాసట
న్యూఢిల్లీః తీవ్రవాదాన్ని తుదముట్టించడంలో భారత్ కుబ్రిటన్ పూర్తి మద్దతు ప్రకటించింది. కాశ్మీర్‌అసెంబ్లీపై జరిగిన దాడిని బ్రిటన్ ప్రధాని టెనీ బ్లెయిర్ ఖండించారు. ఈ మేరకు భారత ప్రధాని వాజ్‌పేయికి బ్లెయిర్ లేఖ రాశారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహించేది ఎవరైనా సహించేది లేదని బ్లెయిర్ తన లేఖలోపేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో బ్లెయర్ పాకిస్తాన్ లో పర్యటించున్న తరుణంలో బ్లెయిర్ ఈ లేఖ రాయడంవిశేషం.
మరోవైపు భారత విదేశాంగ శాఖ మంత్రి జస్వంత్ సింగ్ బుధవారం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అలెన్ పావెల్ ను కలుసుకున్నారు. భారత్ తో పాటు ప్రపంచంలో వున్న తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతోపెకలించి వేయాలన్నదే అమెరికా లక్ష్యం అని పావెల్‌వివరించారు.












Click it and Unblock the Notifications