తాలిబాన్లకు బుష్ అల్టిమేటం
వాషింగ్టన్:అఎn్ఘాన్‌లోని తాలిబాన్‌లతో చర్చల ప్రసక్తే లేదని, చర్యకు ఉపక్రమించడమే తరువాయి అని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ మంగళవారం తాజాగా తాలిబాన్లకు అల్టిమేటం జారీ చేశారు. మర్యాదగా లాడెన్‌ను, అతని అనుచరులను అప్పగించండి లేదా పర్యవసానాలను అనుభవించండి అని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికే తమ సైన్యం అఎn్ఘాన్‌ను చుట్టుముట్టిందని, ఏ క్షణమైనా దాడులు ప్రారంభం కావచ్చునని ఆయన అన్నారు. దాడులకు కాలపరిమితిఅంటూ ఏమీ లేదని, తమ సమయాన్ని బట్టి దాడులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
లాడెన్‌ను అప్పగిస్తారా లేదా అధికారాన్ని వదులుకుంటారా ఏదో ఒకటి తేల్చుకోండి అని మరో పక్కబ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ హెచ్చరించారు. ఉగ్రవాదంపై అమెరికా జరుపుతున్న పోరాటానికి భుజం భుజం కలిపి సహకారంఅందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications