చెన్నై ఎయిర్‌పోర్టులో హైజాక్ డ్రామా
చెన్నైః చెన్నై విమానాశ్రయంలో బుధవారం నాడు హైజాక్ డ్రామా అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని హైజాక్ చేయనున్నట్టుగా బుధవారం ఉదయమే వరసగా మూడు ఫోన్ కాల్స్ రావడంతో అధికారులు బెంబేలెత్తిపోయారు.
ఈ ఫోన్‌కాల్స్‌తో అప్రమత్తమైన పోలీసులుపెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. విమానాశ్రయంలోకి వెళ్లుతున్న ప్రయాణికులనుఅంగుళం కూడా వదలకుండా గాలించి విడిచిపెట్టారు. ఇదిలా వుండగా ఎందుకైనా మంచిదనే ఉద్దశ్యంతోరైల్వే స్టేషన్లలో కూడా బందోబస్తు పెంచారు. ఫోన్ చేసిందెవరనేవిషయం ఇప్పటి వరకు తెలియదని అధికారులు చెప్పారు. 15 నిమిషాల వ్యవధిలో మొత్తం మూడు కాల్స్ వచ్చాయని గొంతునుబట్టి కాల్ చేసింది చిన్నపిల్లవాడైనా కావాలి లేదాస్త్రీ అయినా కావాలని అంటున్నారు. ఈ కాల్స్ తమిళంలోనే వచ్చినట్టుగా వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications