పాక్‌పై యుద్ధానికిఫరూఖ్ పిలుపు
శ్రీనగర్‌ఃఉగ్రవాదుల వల్ల దైనందిన జీవితం నరకప్రాయంగామారిన కాశ్మీర్ ప్రజలకు విముక్తి కలిగించేందుకుపాకిస్తాన్‌పై భారత్ యుద్ధం ప్రకటించాలనిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాడిమాండ్ చేశారు. సైనిక చర్యతో పాకిస్తాన్‌లోనితీవ్రవాద శిక్షణా శిబిరాలను ధ్వంసం చేయాలనిఆయన కోరారు.
సహనానికికూడా హద్దు వుంటుందని, ఎంత కాలం తాముఈ బాధలు అనుభవించాలని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం నాడు ఆయన ఉద్వేగపూరితంగా,ఆవేదనతో, ఆగ్రహంతో సుదీర్ఘంగాప్రసంగించారు. ప్రసంగం మధ్యలో ఆయన కంఠం ఒక దశలో దుఃఖంతో పూడుకుపోయింది. సభలోని యావన్మంది సభ్యుల కళ్లలో నీళ్లు తిరిగాయి.
దెబ్బకు దెబ్బ అనే సిద్ధాంతానికి తాము వ్యతిరేకమేననిఅయితే పాకిస్తాన్ చేష్టలతో ఓపిక నశించిందనిఆయన అన్నారు.
యుద్ధంప్రకటించింది భారత్ పాకిస్తాన్‌పై దండెత్తిఅక్కడ కుప్పతెప్పలుగా వెలసిన టెర్రరిస్టుశిక్షణాకేంద్రాలను ధ్వంసం చేయాలని ఆయనపిలుపునిచ్చారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్‌ప్రజలు పోకచెక్కలా నలిగిపోతున్నారని ఆయనఅవేదన వ్యక్తం చేశారు. ఒక దేశం ఇక్కడఅమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదనిమరో దేశం మౌన ప్రేక్షక పాత్ర వహిస్తున్నదనిఆయన దుయ్యబట్టారు. న్యూయార్క్, పెంటగాన్‌పైదాడుల తర్వాత అమెరికా 24 గంటలు కూడా గడవకుండానేటెర్రరిస్టులపై, టెర్రరిస్టులకు ఊతం ఇస్తున్నవారిపైసమరం ప్రకటించిందని సమస్త బలగాలనుసన్నద్ధం చేసిందని ఫరూఖ్ అన్నారు.
భారత్‌మాత్రం 12 ఏళ్లుగా హింసను భరిస్తూ కూడానిమ్మకు నీరెత్తినట్టుగా వున్నదని ఆయనదులిపేశారు. ఇళ్లలో కార్యాలయాల్లో కూడా తమనుప్రశాంతంగా ఉండనీయడం లేదని పాకిస్తాన్ ఇచ్చినఆయుధాలతో టెర్రరిస్టులు నరమేధం సృష్టిస్తున్నారనిఆయన ఆరోపించారు. ఫరూఖ్ అబ్దుల్లా ప్రాణాలు కావాలంటేతాను సరిహద్దుల్లోకి వస్తానని కాల్చిచంపుకోవచ్చనిఆయన ఆవేశంగా అన్నారు. రాష్ట్ర ప్రజలను మాత్రంవిడిచిపెట్టాల్సిందిగా కోరారు.












Click it and Unblock the Notifications