4న గుజరాత్ కొత్త సిఎం ఎన్నిక
గాంధీనగర్: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక గురువారం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్ర పరిశీలకుడు కుశుభావ్ ఠాక్రే, గుజరాత్ పార్టీ ఇన్‌చార్జి మదన్‌లాల్ ఖురానా బుధవారం ఉదయం గాంధీనగర్ చేరుకున్నారు. గురువారం బిజెపి లెజిస్లేచర్ పార్టీ కొత్త నేత ఎన్నిక సజావుగా జరిగేలా వీరు చూస్తారు.
బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఉదయం పది గంటలకు జరుగుతుంది. తన రాజీనామాను సమర్పించడానికి ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ మూడున్నర గంటలకు గవర్నర్ ఎస్.ఎస్. భండారీ కలుస్తారు. అనంతరం లెజిస్లేచర్ పార్టీ కొత్త నేత గవర్నర్‌ను కలుస్తారు.
కొత్త ముఖ్యమంత్రిగా పదవి చేపడతారని భావిస్తున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శినరేంద్ర మోడి కూడా బుధవారంనాడు ఇక్కడికి చేరుకున్నారు. పార్టీ జాతీయ నాయకులు గుజరాత్ బిజెపి శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications