అసెంబ్లీలో బావురుమన్న ఫరూఖ్ అబ్దుల్లా
శ్రీనగర్‌ః కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా శ్రీనగర్‌అసెంబ్లీలో బావురు మన్నారు. కాశ్మీర్ నిప్పుల కుంపటిగా మారడానికి పాకిస్తానే కారణం అని, ఇక ఉపేక్షించి లాభం లేదని ఆయనఅసెంబ్లీలో గర్జించారు. పాకిస్తాన్ పై యుద్ధాన్ని ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేసిన ఫరూఖ్ ఆ తరువాతఅసెంబ్లీ హాలులోనే కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. కాశ్మీర్ లో చిన్నారులు.... మహిళలు తీవ్రవాదానికి కన్ను మూస్తున్నారు.... వందలాది మంది అమాయకులు తూటాలకు బలౌతున్నారు.... తీవ్రవాదాన్ని నిర్మూలించమని కోరుతున్నా అల్లా ఎందుకో దయచూపడం లేదంటూ ఫరూఖ్ భోరు మన్నారు.
తీవ్రవాదానికి కేంద్రానికి మధ్య కాశ్మీర్ ప్రజలు నలిగి పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్‌అసెంబ్లీపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఫరూఖ్ అభివర్ణించారు. ఈ దాడిలో 40 మంది మరణించినవిషయం విదితమే. ఏకంగా కాశ్మీర్ అసెంబ్లీపైనే తీవ్రవాదులు దాడి జరపడంతో చలించిపోయిన ఫరూఖ్‌అసెంబ్లీలో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇంతటి దుశ్చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ ను ఇక వదిలిపెట్ట రాదని కేంద్రాన్నికోరారు.












Click it and Unblock the Notifications