నాలుగో రోజూ నిప్పులు చెరిగిన అమెరికా
వాషింగ్టన్‌ః వరుసగా నాలుగో రోజు రాత్రి కూడా ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా నిప్పులు చెరిగింది. అమెరికాకు చెందిన కనీసం 50 యుద్ధవిమానాలు బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మళ్ళీ దాడులకు దిగాయి. బుధవారం ఉదయం నుంచే కాబుల్, కాందహార్ లపై అమెరికామిసైళ్ళ వర్షం కురిపించింది. అమెరికా మిసైళ్ళు సామాన్య పౌరుల ఇళ్ళను ధ్వంసం చేశాయి.పెద్ద సంఖ్యలో అమాయక పౌరులు మరణించినట్లు ఇస్లామాబాద్ కు సమాచారంఅందింది.
రెండో రోజు రేయింబవళ్ళు అమెరికావిమానాలు దాడలకు దిగాయి. పగటి దాడుల్లో కాబుల్‌పైనే దాడులు జరిపిన అమెరికా రాత్రి దాడులను ముమ్మరంగా చేస్తున్నది.మిసైళ్ళ మోతలతో ఆఫ్ఘనిస్తాన్ దద్దరిల్లి పోతున్నది. కరెంట్ నిలిపివేసి అమెరికా దాడులను తిప్పికొట్టేందుకు తాలిబాన్లు యథాశక్తి ప్రయత్నస్తున్నారు. నిన్నటి వరకు మౌనంగా వున్న అల్ - ఖైదా బుధవారం నేరుగా రంగంలోకి దిగింది. అల్-జహీరా టెలివిజన్ లో అల్ ఖైదా ప్రతినిధి తన సందేశంవినిపించారు.
అమెరికా చేస్తున్న దాడుల్ని తిప్పికొట్టేందుకు పూర్తి అధికారాన్ని తాలిబన్లు లాడెన్ కుఅప్పగించారని ఆ ప్రతినిధి అన్నారు. అమెరికాకు తగిన శాస్తి చేస్తామని హెచ్చరించడంవిశేషం. బాగా ఎత్తు నుంచి అమెరికా విమానాలు దాడులు నిర్వహించడంతో ఆఫ్ఘన్ క్షిపణులు వాటికి ఎటువంటి హాని కలిగించలేకపోతున్నాయి. త్వరలో తక్కువ ఎత్తు నుంచి తీవ్రవాద స్థావరాలను టార్గెట్ చేయడంతో పాటు పదాతి దళాలను రంగంలోకి దించాలని అమెరికా యోచిస్తున్నది.












Click it and Unblock the Notifications