మంత్రులు, అధికార్లపై బాబు గరం
హైదరాబాద్‌ః పనికి ఆహారం పథకాన్ని సక్రమంగా అమలు చేయడంలోవిఫలం అయిన మంత్రులు, అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవు, భారీ వర్షాలపై బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పనికి ఆహారం పథకం అమలు తీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ పథకం బాధ్యతలను మంత్రులు, అధికారులకుఅప్పగించినా పధకం సరిగా అమలు కాలేదని చంద్రబాబు మండి పడ్డారు. కేంద్రం ఇచ్చిన 30 లక్షల టన్నుల ఆహార ధాన్యాలలో ఇప్పటి వరకు కేవలం 25 శాతం మాత్రమే పంపిణా చేయడానికి గల కారణాలు ఏమిటని చంద్రబాబు అధికారులపై మండి పడ్డారు.
కొద్ది రోజులుగా రాష్ట్రమంతటా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే పనికి ఆహార పధకంలోపురోగతి సాధించలేక పోయినట్లు అధికారులువివరించారు. అధికారుల వివరణతో చంద్రబాబు సంతృప్తి చెందలేదు. కరవు పనులు, భారీ వర్షాల నష్టాల గురించిన పూర్తివివరాలను ఇంటర్నెట్ లో వుంచాల్సిందిగా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications