ఆఫ్ఘన్ పై త్వరలో హెలికాప్టర్ దాడులు
వాషింగ్టన్‌ః వరుసగా నాలుగోరోజు ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు జరుపుతున్న అమెరికా దగ్గర నుంచి తాలిబాన్ స్థావరాలను ధ్వసం చేసే లక్ష్యంతో హెలికాప్టర్ దాడులు ప్రారంభించనున్నది. న్యూయార్క్ టైమ్స్ బుధవారం నాడు ఈవిషయాన్ని వెల్లడించింది. నాలుగు రోజులుగా ఆఫ్ఘన్ గగనతలం నుంచి క్షిపణుల వర్షం కురిపిస్తున్న అమెరికా ఇప్పటికే కొన్ని యుద్ధ హెలికాప్టర్లను ఆఫ్ఘన్ సమీపంలోకి తరలించింది.
బాంబర్లతో దాడి చేయడం వల్ల ఆఫ్ఘన్‌సైనిక లక్ష్యాలను ధ్వసం చేయడం సాధ్యం కాకపోవడంతో హెలికాప్టర్‌లతో దాడులకు దిగాలని పెంటగాన్ వర్గాలు భావిస్తున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. ఒకటి రెండు రోజుల్లో పదాతిదళాలను కూడా రంగంలోకి దించాలనే ఉద్దేశ్యంతోపెంటగాన్ వర్గాలు వున్నట్లు ఆ పత్రిక పేర్కొన్నది. రాత్రి పూట దాడుల్లో పాల్గొనేందుకువీలుగా ప్రత్యేకంగా రూపొందించిన బ్లాక్ హాక్స్ వంటి యుద్ధ హెలికాప్టర్లను రంగంలోకి దించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
ఇకపోతే లాడెన్ కు చెందిన అల్ - ఖైదా స్థావరాలు ఫిలిప్పీన్స్, ఇండొనీసియా, మలేసియాల్లో కూడా వున్నాయని భావిస్తున్నారు. వాటిపై కూడా అమెరికాసేనలు కొవర్ట్ దాడులకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. లాడెన్ కు పలు దేశాలలోని తీవ్రవాద సంస్థలతో సంబధాలున్నందున వాటిని నిర్మూలించేందుకు దీర్ఘకాలం, బహుశా ఏళ్ల పాటు యుద్ధం జరపక తప్పదనే ఉద్దేశంతోపెంటగాన్ వర్గాలు వున్నట్లు న్యూయార్క్ టైమ్స్‌వివరించింది.












Click it and Unblock the Notifications