భారత్ అమెరికా బుజ్జగింపు
వాషింగ్టన్‌ః కాశ్మీర్ తీవ్రవాదం గురించి అమెరికావిస్మరించలేదని అమెరికా విదేశాంగ మంత్రి అలెన్ పావెల్ బుధవారం ప్రకటించారు. తీవ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో భారతదేశం, పాకిస్తాన్ లు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
త్వరలో జరిపే భారత్, పాక్ పర్యటనల్లో కాశ్మీర్‌అంశం గురించి ప్రధానంగా చర్చిస్తానని ఆయన అన్నారు. కాశ్మీర్‌అంశాన్ని అమెరికా విస్మరించదని ఆయన చెప్పడం కేవలం భారత్, పాక్ లను బుజ్జగించేందుకే అని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాపై మరిన్ని దాడులు చేస్తామంటూ లాడెన్ అనుయాయులు బుధవారం వెల్లడించడంపై పావెల్ మండి పడ్డారు. ఈ వ్యాఖ్యలు వారి దుష్టబుద్ధికి నిదర్శనం అని పావెల్ అన్నారు.












Click it and Unblock the Notifications