సైతాన్ సాయం మాకొద్దుః ఆఫ్ఘన్
ఇస్లామాబాద్‌ః తమపై దాడులకు దిగిన అమెరికాఅందజేస్తున్న సహాయాన్ని ఆఫ్ఘన్ ప్రజలు తగలబెట్టారు. యుద్ధం కారణంగా ఆహారపదార్ధాలుఅందక అల్లాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా విమానాలు ఆహార పదార్ధాలు జారవిడిచాయి. అయితే తమ శత్రువుఅందిస్తున్న సహాయాన్ని ఆఫ్ఘన్ పౌరులెవరూ ముట్టుకోవడం లేదని,పైగా సైతాన్ రూపంలో వచ్చిన ఆహారపదార్ధాలను తగలబెడుతున్నట్లు ఇస్లామాబాద్ లోని ఆఫ్ఘనిస్తాన్ దౌత్యవేత్త చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో వున్న వివిధ పట్టణాల్లో అమెరికా జారవిడిచిన ఆహార పదార్ధాలను తగులబెట్టారని ఆయన చెప్పారు.
చెక్కు చెదరనిఆఫ్ఘన్ స్థావరాలుః
ఆఫ్ఘనిస్తాన్ రక్షణ స్థావరాలను ధ్వంసం చేశామంటూ అమెరికా చేస్తున్న ప్రకటనలను తాలిబన్ ప్రభుత్వం అవహేళన చేసింది. మా రక్షణ స్థావరాలు చెక్కు చెదరకుండా వున్నాయని పాకిస్తాన్ లోని తాలిబాన్ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. అమెరికామిస్సైల్స్ కాబుల్ లోని జనావాసాలపై పడ్డాయని, పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారని ఆఫ్ఘన్ రాయబారి అబ్దుల్ సలామ్ జయీఫ్ చెప్పారు.
కాబూల్ పై పట్టు సాధించామనే అమెరికా ప్రకటనలు కూడా వాస్తవం కాదని ఆయన చెప్పారు. తాలిబన్ సారధి ఓమర్, ఒసామాబిన్ లాడెన్ సురక్షితంగా వున్నారని ఆయన ప్రకటించారు. అమెరికా దాడులను తిప్పి కొట్టడానికి వేలాది మంది ముస్లిం యువకులు సిద్ధంగా వున్నారని అంతకు ముందు అల్ -ఖైదా ప్రతినిధి అల్ జహీరా టెలివిజన్ నుంచి ప్రకటించారు.












Click it and Unblock the Notifications