ఇక భూతల యుద్ధం...
న్యూయార్క్‌ః అఎn్గాన్‌పై అమెరికా దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. ఆదివారం, సోమవారం కేవలం రాత్రి దాడులకు మాత్రమే పరిమితమైన అమెరికా మంగళవారం నుంచి దాడులను ముమ్మరంగా రేయింబవళ్లు కొనసాగిస్తున్నది. బుధవారం ఉదయం కాందహార్, హెరత్, కాబూల్ పట్టణాలపై భారీ ఎత్తున బాంబుల వర్షం కురిసింది.
మెరుపువేగంతో దూసుకువచ్చి, బాంబుల వర్షం గుప్పించి వెళ్లతున్న అమెరికా యుద్ధవిమానాలు అఎn్గాన్ ప్రజలను గడగడలాడిస్తున్నాయి. మూడు రోజుల గగనతల దాడులతో తాలిబన్ నడుములువిరిచిన అమెరికా ఇప్పుడు తుదిపోరును భూమార్గం పట్టించే సన్నాహాల్లో వుంది. బాంబుల తాకిడికిఅఎn్గాన్‌లోని తాలిబన్ల తీవ్రవాద కేంద్రాలు, సైనిక స్థావరాలు, వైమానిక కేంద్రాలు నామరూపాలు లేకుండా పోయాయని అమెరికన్ వర్గాలు చెబుతున్నాయి.విమాన విధ్వంసక క్షిపణులనేటివే ఇప్పుడుఅఎn్గాన్ల వద్ద లేకుండా పోయాయని అంటున్నారు.
అమెరికన్ పదాతి దళాలు నిర్వఘ్నంగా ముందుకు చొచ్చుకుపోవడానికి పరిస్థితి అనుకూలంగా వున్నదని వారు చెబుతున్నారు. పదాతిదళాలు రంగంలోకి దిగితే తాలిబన్ల అధికారానికి చరమగీతం పాడి ప్రత్యామ్నాయ సర్కార్‌ను ఏర్పాటు చేయడమేమిగిలివుంటుంది. అయితే భూమి మీద పోరులోనే అమెరికాకు ప్రతిఘటన తీవ్రంగా వుండే అవకాశం వుంది. చిన్నచిన్న బృందాలుగా ఆధినిక ఆయుధాలు, ట్యాంకులతో తాలిబన్‌సేనలు అఎn్గాన్ కొండల్లో పొంచుకుని వున్నాయి.
నార్తర్న్ అలయెన్స్ దళాలకు ఆకాశం నుంచి రక్షణ కల్పిస్తూ ముందుకు చొచ్చుకుపోవడానికి వెసులు బాటు కల్పించాలని మరోవైపు తమ కమెండోలను కూడా రంగంలోకి దింపాలని అమెరికన్‌సైనిక వ్యూహకర్తలు నిర్ణయించారు. మూడు రోజులపాటు ముమ్మరంగా ఏకపక్షంగా సాగిన దాడులతోఅఎn్గాన్ దాదాపు నిర్వీర్యమైంది. జలాలాబాద్ వంటి పట్టణాల్లో శిథిలాలు తప్ప మానవ ఆవాస అవశేషాలు కూడా కనిపించడం లేదనిఅంటున్నారు.












Click it and Unblock the Notifications