భూతల పోరు ప్రారంభం
కాబూల్‌ః పదిరోజుల పాటు నిర్విరామంగా బాంబుదాడులతో అఎn్గాన్‌లో భారీ విధ్వంసం సృష్టించిన అమెరికా భూతల పోరాటం ప్రారంభించింది. అమెరికన్ కమెండో దళాలు మంగళవారం నాడు అఎn్గాన్‌లోకి ప్రవేశించాయి. ఈ కమెండోలకు దన్నుగా మంగళవారం నాడు అమెరికన్ యుద్ధ విమానాలు పెద్దపెట్టున కాందహార్, కాబూల్, జలాలాబాద్, మజారే షరీఫ్‌పై బాంబుల వాన కురిపించాయి. కాందహార్‌లో గత 24 గంటల్లోనే 130 భారీ విస్ఫోటనాలు వినిపించినట్టుగా చెబుతున్నారు.
తొలిసారిగా తక్కువ ఎత్తులోంచి దాడులు జరిపే ఎసి-130విమానాలు కూడా రంగంలోకి వచ్చాయి. ఈ విమానాలు తాలిబన్ ప్రధాన కార్యాలయంపైనా కాందహార్‌లోని ట్రూప్ కాంప్లెక్స్‌పైనా ముమ్మారు బాంబులు కురిపించాయి. గత పదిరోజుల్లో అమెరికా ఈవిమానాలను ప్రయోగించడం ఇదే ప్రధమం. హెలికాప్టర్ గన్‌షిప్‌లు కూడా దాడులు ప్రారంభించినట్టుగా తెలిసింది. తాలిబన్లసైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసం కావడంతో గగనతలంలో అమెరికాకు ఎదురులేకుండా పోయింది. సోమవారం రాత్రి జరిపిన దాడుల్లోనే కాబూల్‌లోనివిద్యుత్ వ్యవస్థను సమూలంగా అమెరికా ధ్వంసం చేసింది. కాబూల్, కాందహార్ వంటి పట్టణాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. మరోవైపు దాడుల జోరుకు నైతిక స్థయిర్యం సన్నగిల్లిన తాలిబన్‌సైనికులు పెద్ద సంఖ్యలో ప్రత్యర్ధి కూటమి నార్తర్న్ అలయెన్స్‌వైపు ఫిరాయిస్తున్నట్టుగా వార్తలుఅందాయి. సుమారు రెండు వేల మంది ఫిరాయించినట్టుగా నార్తర్న్ అలయెన్స్ వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications