కదంబం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్‌ఆర్‌టిసి) ఉద్యోగుల సమ్మె పరిష్కారానికి మరో విడత చర్చలు జరుగుతున్నాయి. నాలుగు రోజులుగా ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల రాకపోకలు స్తంభించాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ అవిఅరకొరగానే వున్నాయి. చర్చలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. అయితే ఇంకా ఒక కొలిక్క రాలేదు.

సమ్మె పరిష్కారానికి ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు తొలుత ఆర్టీసి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఒకఅంగీకారానికి వచ్చిన తర్వాత మంత్రి వర్గ ఉపసంఘాల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఈ చర్చల్లో టి. దేవేందర్‌ గౌడ్‌, కడియం శ్రీహరి, తదితర మంత్రులు పాల్గొంటున్నారు.

ప్రభుత్వం సమ్మె పరిష్కారం విషయంలో మొండి వైఖరి అవలంభిస్తోందని ఐక్య కార్యాచరణ సమితి నేతలుఅంటున్నారు. తమ సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోందని,అయినప్పటకీ ప్రభుత్వపరంగా కదలిక లేదని వారన్నారు. తమకు రాజకీయ మద్దతు కూడా లభిస్తోందని వారు చెప్పారు. కాంగ్రెస్‌, బిజెపి, మజ్లీస్‌, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమకు మద్దతు తెలిపాయని వారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+