ఖోస్ట్ లో క్షేమంగా లాడెన్!
ఇస్లామాబాద్‌ః అమెరికా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని గాలిస్తున్నబిన్ లాడెన్ ఎక్కడ వున్నాడు? ఇది నిజంగా బిలియన్ డాలర్ల ప్రశ్నే. లాడెన్ కుమారుడి మాటలను బట్టి ఆఫ్ఘనిస్తాన్ లోని ఓ భూగర్భ స్థావరంలో లాడెన్ నిక్షేపంగా వున్నాడు. ఇటీవల లాడెన్ అల్ జహీరా టెలివిజన్ లో ప్రత్యక్షం అయ్యాడు. ఆ సమయంలో ఆయన వున్న భూగర్భ స్థావరాన్ని అధ్యయనం చేసిన నిపుణులు ఆ గుహ పక్టియా ప్రావిన్స్ లోని ఖోస్ట్ లో వున్నట్లు చెబుతున్నారు. తాలిబన్లకు ఈ ప్రాంతాన్నిపెట్టని కోటగా చెబుతున్నారు.
అమెరికా రెండు వారాలుగా దాడులు చేస్తున్నప్పటికీ ఒసామాబిన్ లాడెన్ నిక్షేపంగా వున్నట్లు సీనియర్ తాలిబాన్ కమాండర్ ఆదివారం వెల్లడించారు. లాడెన్ ఆయన సన్నిహితులు సురక్షితంగా వున్నారు. వారికి ఎటువంటి హాని జరగలేదని తాలిబన్ సరిహద్దు ప్రాంతాల మంత్రి హకానీ చెప్పారు. ఇదిలా వుండగా అమెరికా చేస్తున్న యుద్ధపై చర్చించేందుకు తాలిబన్ మంత్రిమండలి ఆదివారం సమావేశమైంది. అమెరికాపై మరింత జోరుగా యుద్ధం చేసేందుకుసైనికులకు మరిన్ని ఆయుధాలు అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications
