మోహినీ రూపంలో శ్రీనివాసుడు
తిరుమలః కలియుగ వైకుంఠ నాధుడైన శ్రీ వేంకటేశ్వరుడు ఆదివారం ఉదయం మోహినా అవతారంలో దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం ఆయన మోహినీ రూపంలో తిరుమల మాడవీధుల్లోఊరేగారు.
సాగరమధనం సందర్భంగా రాక్షసులకు అమృతంఅందకుండా చూసేందుకు మహా విష్ణువు మోహినీ అవతారం ఎత్తినవిషయం విదితమే. మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడైన వెంకటేశ్వరుడు కన్నుల పండువగా భక్తులకు దర్శనం ఇచ్చారు.
ముక్కు పుడక, చేతిలో స్వర్ణమయమైన చిలుకను ధరించి శ్రీనివాసుడు భక్తులకు కనువిందు చేశాడు. మోహినీ రూప ధరుడైన శ్రీ వేంకటేశ్వరుని దర్శించిన వారికి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదిరోజులూస్వామి వారిని దర్శించుకున్న ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications
