మంగళగిరి కోక్ కంపెనీపై వార్ దాడి
గుంటూరుః గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు -పెదవడ్లపూడి గ్రామాల మధ్య పీపుల్స్ వార్ నక్సలైట్లు ఆదివారం వేకువజామున విధ్వంసం సృష్టించారు. ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన కోకాకోలా కంపెనీపై 11 మంది వార్ నక్సలైట్లువిరుచుకు పడ్డారు. కంపెనీపై దాడి చేసి మూడు వాహనాలను, యంత్ర పరికరాలను ధ్వంసం చేశారు.
జనరేటర్, బాయిలర్ తో పాటు మరికొన్ని పరికరాలను నక్సలైట్లు ధ్వంసం చేశారు. కంపెనీసెక్యూరిటీ సిబ్బందిని కట్టివేసి నక్సలైట్లు తమ దుశ్చర్య కొనసాగించారు. నక్సలైట్ల రాకను గమనించిన ఓ కార్మికుడు సమయోచితంగా కరెంట్ నిలిపివేసి, మంగళగిరి చేరుకొని పోలీసులకు సమాచారంఅందించారు. ఈ చర్యలో ఓ మహిళా నక్సలైట్ కూడా పాల్గొన్నట్లు పోలీసులువివరించారు.
నక్సలైట్ల కదలికలు ఏ మాత్రం లేని మంగళగిరి మండలంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసు అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సోమవారం వార్ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ కు మద్దతుగా నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
ఎండిఓ ఆఫీస్‌పేల్చివేసిన వార్
వరంగల్‌ః వరంగల్ జిల్లా ఏటూరినాగారం ఎండిఓ కార్యాలయాన్నిపీపుల్స్ వార్ నక్సలైట్లు ఆదివారం తెల్లవారు జామునపేల్చి వేశారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా కనీసం పది మంది నక్సలైట్లు శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక ఎండిఓ కార్యాలయం చేరుకొని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఎండిఓ కార్యాలయం పూర్తిగా కూలిపోయింది. రికార్డులు, ఫర్నిచర్ ధ్వంసమైంది.












Click it and Unblock the Notifications
