వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం
హైదరాబాద్‌ః వ్యవస్థీకృత నేరాలను అదుపుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక చట్టం వారం పదిరోజుల్లో అమల్లోకి వచ్చే అవకాశం వుంది.
ఈవిషయం డిజిపి హెచ్‌జె దొర చెప్పారు. ఈ కొత్త చట్టానికి రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ ఆమోద ముద్ర లభించడంతో ఇక అమల్లోకి తేవడమే తరువాయి అని ఆయన చెప్పారు.ముంబాయి తరహాలో హైదరాబాద్‌లోనూ ఇతర ప్రధాన నగరాల్లోనూ ఈ మధ్య కాలంలో వ్యవస్థీకృత నేరాలు జరుగుతున్నాయని ఆదిలోనేవీటిపై వేటు వేయడం అవసరమని ఆయన చెప్పారు. ఇప్పుడు ఉపేక్షిస్తే ఆ తర్వాతవీటిని అణిచివేయడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. ఈ చట్టం కిందఅరెస్టయిన వారికి బెయిల్ రాదు. పోలీసు అధికారుల ముందు ఇచ్చిన సాక్ష్యాన్ని కోర్టు కూడా ఆమోదించాల్సివుంటుంది. ఇలాంటి కఠిన మైన నిబంధనల వల్ల చట్టాల్లోని లొసుగులను అడ్డుపెట్టుకుని తప్పుకునే అవకాశం నిందితులకు వుండదు.












Click it and Unblock the Notifications