వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా, అమెరికాల్లో వాజ్‌పేయి టూర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌ పేయి నవంబర్‌ నాలుగు నుంచి వారం రోజుల పాటు రష్యా, అమెరికా,బ్రిటన్‌ లలో పర్యటించనున్నారు. వచ్చే వారం ప్రారంభంలో వాజ్‌పేయి రష్యాలో పర్యటిస్తారు. ఆ తరువాత అమెరికా చేరుకుంటారు. నవంబర్‌ 9న వాజ్‌పేయి అమెరికా అధ్యక్షుడు బుష్‌ తో భేటీ అవుతారు. వాజ్‌పేయి అమెరికా పర్యటన సందర్భంగా అక్కడకు వచ్చే పాక్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ తో చర్చలు జరిపేదీ లేనిదీ ఇంకా తేలలేదు.

వాజ్‌పేయి బుష్‌ ల మధ్య ఉగ్రవాదం, కాశ్మీర్‌ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. కాశ్మీర్‌అంశంపై భారత్‌ - పాక్‌ ల మధ్య ఉద్రిక్తత పెరిగిపోవడం, ఆఫ్ఘనిస్తాన్‌ పై అమెరికా యుద్ధం నేపధ్యంలో వాజ్‌పేయి - బుష్‌ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాజ్‌పేయి ఆ తరువాత బ్రిటన్‌ లో పర్యటిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X