వాషింగ్టన్‌ః వాజ్‌పేయి - బుష్ ల శిఖరాగ్రం జయవంతం అయినట్లు భారత్, అమెరికాలు ప్రకటించారు. అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని వాజ్‌పేయి శుక్రవారం నాడు అమెరికా అధ్యక్షుడు బుష్ తో వైట్ హౌస్ లో సుదీర్ఘం గా చర్చలు జరిపారు. ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం, అంతరిక్ష, అణుద్యుత్, రక్షణ తదితరఅంశాలపై ఉభయదేశాల నేతలు చర్చలు జరిపారు.
భారత దేశాంగ శాఖ మంత్రి జస్వంత్ సింగ్ వాషింగ్టన్ లో లేకరులతో మాట్లాడుతూ వాజ్‌పేయి - బుష్ ల శిఖరాగ్రం జయవంతమైందని ప్రకటించారు. రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య నూతనాధ్యాయానికి నాంది జరిగిందని జస్వంత్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం షయాన్ని కూడా అమెరికా దృష్టికి తీసుకువెళ్ళ గలిగామని ఆయన తెలిపారు.
అంతకుముందు వాజ్ పేయి వాషింగ్టన్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమస్యను జటిలం చేయరాదనే ఉద్దేశంతోనే భారత్ మౌనంగా వున్నదని చెప్పారు. కాశ్మీర్ లో పాకిస్తాన్ సృష్టిస్తున్న మారణహోమానికి భారత్ ఏ స్ధాయిలో స్పందించినా తప్పులేదని వాజ్‌పేయి అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా పోరు ప్రారంభించిన ప్రస్తుత తరుణంలో కాశ్మీర్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురాకూడదనే ఉద్దేశ్యంతోనే మౌనం వహిస్తున్నట్లు ఆయన వరించారు.












Click it and Unblock the Notifications