వాషింగ్టన్‌ః వచ్చే ఏడాది పాకిస్తాన్ లో జరిగేసార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని పాక్ సైనికాధ్యక్షుడు జనరల్‌పర్వేజ్ ముషారఫ్ ప్రకటించారు. అధ్యక్ష పద నుంచి కూడా వైదొలగనని ఆయన చెప్పుకున్నారు. పాకిస్తాన్ లో ఎన్నికల తరవాత తటస్థ అధ్యక్షుడిగా పేరుతెచ్చుకోవాలన్నదే తన అభిమతమని అమెరికా వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ వరిచారు.
పాకిస్తాన్ లోసార్వత్రిక ఎన్నికలు జరిగేలోపున అధ్యక్షుడికి అసాధారణ అధికారాలు కట్టబెడుతూ రాజ్యాంగాన్ని సవరించేందుకు ముషారఫ్ ప్రయత్నిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. ఈఅంచనాల మధ్య అధ్యక్షపద నుంచి ఎన్నికల తరువాత కూడా తప్పుకోనంటూ ముషారఫ్ ప్రకటించడం శేషం. ఆఫ్ఘన్ పై యుద్ధంలో ముషారఫ్ అమెరికాకు భారీగా సాయం చేయడానికి కూడా ఓ పరమార్ధం వున్నదని కొందరు వాదిస్తున్నారు. పాక్ లోసార్వత్రిక ఎన్నికల తరువాత కూడా అధ్యక్షపదనిఅంటిపెట్టుకోవాలన్నదే ముషారఫ్ ఆలోచన అనే వ్యాఖ్యలు నిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
