సర్కార్ కు తాలిబన్లు దూరంః వాజ్‌పేయి
లండన్‌ః ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పాటు కానున్న నూతన ప్రభుత్వంలో తాలిబన్లకు స్థానం వుండరాదని భారత ప్రధాని వాజ్‌పేయి అభిప్రాయ పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాలిబన్లకు ఆఫ్ఘన్ లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో స్థానం వుండరాదని ప్రపంచ దేశాలన్నీ అభిప్రాయ పడుతున్నాయని లండన్ లో లేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. తొు్మది రోజుల పాటు రష్యా, అమెరికా,బ్రిటన్ లో పర్యటించిన వాజ్ పేయి ఉగ్రవాదంపై ఆయా దేశాధినేతలతో జరిపిన చర్చల వరాలు వెల్లడించారు. తాలిబన్లలో కొందరికి భష్యత్ ప్రభుత్వంలో స్థానం కల్పించవచ్చునని, అయితే ఇది కేవలం ప్రతిపాదన దశలోనే వున్నదని వాజ్‌పేయి అన్నారు.
ఈ సందర్భంగా లేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వాజ్‌పేయి సమాధానాలిచ్చారు. అయితే రంజాన్ సందర్భంగా కాశ్మీర్ లో కాల్పుల రమణ ప్రకటించాలనే హురియత్ కాన్ఫరెన్స్ డిమాండ్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని వాజ్‌పేయి దాటవేశారు. తన మూడు దేశాల పర్యటన ఎంతో సంతృప్తికరంగా సాగిందని, అమెరికా, రష్యా,బ్రిటన్ లతో మరింత స్నేహ సంబంధాలు ఏర్పడేందుకు తోడ్పడిందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
