న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలం సమావేశాలు సోమవారంనాడు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన కాంగ్రెస్ లోక్‌సభ ఉపనాయకుడు మాధవరావు సింథియాకు, మాజీ పార్లమెంటు సభ్యుడు కోట్ల జయభాస్కర్ రెడ్డికి పార్లమెంటు నివాళులుఅర్పించింది. ఈ ఇద్దరు నేతల సేవలను స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి కొనియాడారు.
సమావేశాల ప్రారంభం రోజయిన సోమవారంనాడు కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండవసారి రక్షణ శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన జార్జి ఫెర్నాండెజ్‌ను ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి పరిచయం చేసినప్పుడు ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మరణించిన నేతలకు నివాళులుఅర్పించిన అనంతరం సభ మంగళవారంనాటికి వాయిదా పడింది. ఈ సమావేశాలకు ముందుస్పీకర్ జి.ఎం.సి. బాలయోగి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications
