పోటోపై ఎన్‌డిఎ తడబాటు
న్యూఢిల్లీః ఉగ్రవాదం అణిచివేతకు ప్రతిపాదించిన పోటో ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ ఇతర వైరిపక్షాలు నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తుండటంతో అధికార ఎన్‌డిఎ ఇరకాటంలో పడింది. మంగళవారం నాడు పోటోపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రధాని వాజ్‌పేయి అఖరుక్షణంలో తన నిర్ణయం మార్చుకున్నారు.
అయితే అద్వానీ అధ్యక్షతన జరిగే పార్లమెంటరీ సలహా సంఘం సమావేశంలో మాత్రం పోటో పై చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. పోటోపై ఏకాభిప్రాయాన్ని సాధించాలన్నది ప్రధాని అభిమతమని అయితే ప్రతిపక్షాలు తమ వైఖరిని బాహిరంగంగా స్పష్టంచేసినందున అఖిలపక్షం ఏర్పాటు చేసి మళ్లీ వారితో చర్చించడంలోఅర్ధం లేదని ప్రధాని భాస్తున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు సోనియా గాంధీ సారథ్యంలో పక్షాలన్నీ సమావేశమై పోటోను వ్యతిరేకించాలని, పార్లమెంట్‌లో అయోధ్యపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కాగా ఎన్‌డిఎ నేతలు కూడా సోమవారం రాత్రి సమావేశమై చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications
