నిజాంషుగర్స్‌పై టిఎస్‌ఎస్ ధర్నా
హైదరాబాద్: నిజాం పంచదార కర్మాగారం యూనిట్ల ప్రయివేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా తెలంగాణ సాధన సుతి (టిఎస్‌ఎస్) సోమవారం ధర్నా నిర్వహించింది.
నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లోని నిజాంషుగర్స్ యూనిట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్‌లోని నిజాంషుగర్స్ కార్యాలయం షక్కర్ భవన్ వద్ద ఈ ధర్నా జరిగింది. బోధన్ యూనిట్ అమ్మకానికి ప్రభుత్వం సోమవారం టెండర్లు ఆహ్వానించింది. నిజాం చక్కెర కర్మాగారం యూనిట్ల ప్రయివేటీకరణ ప్రయత్నాలకుస్వస్తి చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని టిఎస్‌ఎస్ ప్రకటించింది.
నాలుగు వేల 500 టన్నుల క్రషింగ్ సామర్థ్యం కలిగిన యూనిట్లను ప్రభుత్వం ప్రయివేట్ పరం చేయాలనుకోవడం దారుణమని టిఎస్‌ఎస్ నాయకులన్నారు. యూనిట్లను అు్మ సొమ్ము చేసుకునే ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పి కొడుతామని వారన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్తులను నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమ్మే ప్రయత్నాలను వారు తీవ్రంగా దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications
