పుట్టపర్తిః భగవాన్ పుట్టపర్తి సాయిబాబా జన్మదిన వేడుకలకు పుట్టపర్తి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. మంగళవారం నాడు జరిగిన చైతన్యజ్యోతి వార్షికోత్సవంతో బాబా జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఈ సారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా పుట్టపర్తిలో ఏవరూ ఊహించని ధంగా అభివృద్ధి కార్యక్రమాలనుప్రకటించనున్నట్టుగా బాబా ప్రకటించారు. నవంబర్ 23న జరిగే బాబా జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటినుంచేపెద్ద సంఖ్యలో దేశదేశాలనుంచి భక్తులు పుట్టపర్తి చేరుకుంటున్నారు.
న్యూయార్క్ పై టెర్రరిస్టుల దాడి,అఎn్గాన్ యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో దేశీ భక్తుల సంఖ్య ఈ సారి కొద్దిగా తగ్గే అవకాశం వున్నదని ఉత్సవాల నిర్వాహకులుఅంటున్నారు. మామూలుగానయితే ఈ సరికే దేశీ భక్తుల సందడి వుంటుందని ఈ సారి ఇంకా ప్రారంభం కాలేదని వారు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
