వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్‌ను పట్టుకోవడం ఇంకా కష్టమేనని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ సోమవారం అన్నారు. ఆల్ ఖయిదా నెట్‌వర్క్‌పై ఒత్తిగిపెంచినప్పటికీ లాడెన్‌ను పట్టుకోవడం అంత సులభంగా తోచడం లేదని ఆయన అన్నారు. ఆల్ ఖయిదాపై ఉచ్చు బిగుస్తోందని ఆయన అన్నారు. లాడెన్‌ను పట్టుకోవడానికి ఒక నెల పట్టవచ్చు, ఒక ఏడాది కూడా పట్టవచ్చు అని బుష్ అన్నారు.
తాలిబాన్‌కు వ్యతిరేకంగాఅఎn్ఘానిస్థాన్‌లో అమెరికా నేతృత్వంలోని సైనిక చర్య ఫలితాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.అఎn్ఘానిస్థాన్‌లో పరిమాణాలు చాలా వేగంగా మారిపోయాయని, తమ వ్యూహంసరైందేనని రుజువైందని, కానీ ఇంకా లక్ష్యాన్ని సాధించవలసే వున్నదని ఆయన అన్నారు.
వారు పరుగులు తీస్తున్నారు. మేం వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. వారిని న్యాయం ముందు నిలబెట్టే వరకు పోరాడుతూనే వుంటాం అని బుష్ అన్నారు.
.












Click it and Unblock the Notifications
