కటకటాల్లో ఐపిఎస్‌ అధికారి

హైదరాబాద్‌: భార్యను అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా హింసించి చివరకు హత్యయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణపై కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) ఉప నాయకుడు పి. శంకరరావు అల్లుడు, ఐపిఎస్‌ అధికారి కందిపి. వెంకటేశ్వరరావు కటకటాల పాలయ్యాడు. ఆయనను, ఆయన తండ్రి ప్రకాశరావును పోలీసులు సోమవారం కోర్టు ముందుహాజరు పరిచారు. వారిని వచ్చే నెల మూడో తేదీ వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌కు ఆదేశిస్తూ 21వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

భోపాల్‌లో 23వ బెటాలియన్‌ కమాండెంట్‌గా పని చేస్తున్నపి. వెంకటేశ్వరరావు హైదరాబాద్‌లోని పద్మారావునగర్‌ నివాసి.పి. శంకరరావు తన కుమార్తె సుస్మితను ఆయనకిచ్చి ఈ ఏడాది మే ఆరవ తేదీనపెళ్లి జరిపించారు.

తన కొడుకుతో సమానంగా ఆస్తి పంచి ఇచ్చారు. ఈ సందర్భంగా 150 తులాల బంగారం, గోల్కొండ క్రాస్‌ రోడ్డులోని 25 లక్షల రూపాయల ఖరీదు చేసే ఫ్లాట్‌,కారు, కారు, రూ.25 లక్షల ఖరీదు చేసే గృహోపకరణ వస్తువులను లాంఛనంగా ఇచ్చారు. సంబంధం కుదిరినప్పటి నుంచి ఐదు కోట్ల రూపాయలు నగదు రూపంలో తేవాలని తన మామ, భర్త డిమాండ్‌ చేస్తున్నారని సుస్మిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తాన్ని ఇవ్వకపోవడంతో వారుపెళ్లి జరిగిన నాటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులోపేర్కొంది.
.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+