కాబూల్: తాలిబాన్లు మొండిపట్టు పట్టడంతో కుందుజ్ నగరంపై అమెరికా జెట్లు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. కుందుజ్ నగరం తాలిబాన్ల చేతి నుంచి బయట పడక పోవడంతో అమెరికా దాడులను ఉధృతం చేసింది. రేయింబవళ్లు జరుగుతున్న దాడులతో కుందుజ్ హోరెత్తుతోంది.
కాందహార్, కుందుజ్‌లలోని తాలిబాన్ల లొంగుబాటుకు చర్చలు జరుగుతున్నట్లు అమెరికా రక్షణ మంత్రి రమ్స్‌ఫీల్డ్ చెప్పారు. తాలిబాన్ల లొంగుబాటుకునార్తర్న్ అలయెన్స్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఆల్ ఖయిదాను,అఎn్ఘానేతరులు అఎn్ఘానిస్థాన్ వదిలి వెళ్లేందుకు అనుమతించేది లేదని రమ్స్‌ఫీల్డ్ అన్నారు. వారు ఆయుధాలు ఉంచుకోవడాన్ని కూడా అనుమతించబోమని ఆయన చెప్పారు.
మజారే షరీఫ్, తదితర ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మార్కెట్లు, రహదారులు కళకళలాడుతున్నాయి.
.












Click it and Unblock the Notifications
