లండన్‌:అఎn్ఘానిస్థాన్‌లో అనుసరిస్తున్న వైఖరిపై ఇంగ్లాండు, అమెరికాల మధ్య పొరపొచ్చాలు చోటు చేసుకున్నాయని, దీంతోఅఎn్ఘానిస్థాన్‌లో బ్రిటిష్‌ సైన్యం మోహరింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని లండన్‌లోని వార్తా పత్రికలురాశాయి.

ది టైమ్స్‌, ది ఇండిపెండెంట్‌ పత్రికల వార్తా కథనాల ప్రకారం- అమెరికా లాడెన్‌ను వేటాడడానికి, తాలిబాన్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇస్తున్న ప్రాధాన్యం మానవతా కార్యకలాపాలకు ఇవ్వడం లేదు. అమెరికా లాడెన్‌ను వేటాడడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, దీర్ఘ కాలిక సుస్థిరతను పట్టించుకోవడం లేదు.

అఎn్ఘానిస్థాన్‌లో మోహరించడానికి ఆరు వేలబ్రిటిష్‌ బలగాలు సిద్ధంగా వున్నాయి. మానవతా దృక్పథంతో ఆహార సరఫరాలు జరగడానికి అవసరమైన రహదారుల్లో రక్షణ కల్పించడం, ఎయిర్‌ఫీల్డ్స్‌ను స్వాధీనం చేసుకోవడం, ఐక్య రాజ్యసుతి, సహాయ సంస్థలు భద్రంగా చేరుకోవడం వంటి కార్యకలాపాలు జరగడానికిబ్రిటిష్‌ బలగాలు పని చేస్తాయని బ్రిటిష్‌ ప్రధాని టోనీ బ్లెయిర్‌ సోమవారం చెప్పారు. బలగాలనుఅఫెన్సివ్‌ ఫ్రంట్‌లైన్‌ ఆపరేషన్స్‌లో వాడనున్నట్లు ఆయన తెలిపారు.బ్రిటిష్‌ మెరైన్ల మోహరింపు పట్ల తాలిబాన్‌ వ్యతిరేక నార్తర్న్‌ అలయెన్స్‌ అనుమానాలు వ్యక్తం చేయడం వల్లబ్రిటిష్‌ బలగాలు మోహరింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.అఎn్ఘానిస్థాన్‌లో అమెరికా సైనిక చర్య తీరు పట్లబ్రిటన్‌ అసంతృప్తితో ఉన్నట్లు వచ్చిన వార్తలను టోనీ బ్లెయిర్‌ అధికార ప్రతినిధి ఒకరు ఖండించారు. తమ బలగాల మోహరింపులో ఏరకమైన ఆలస్యం జరగదని ఆయన అన్నారు.
.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+