కాబూల్‌ః చావనైనా చస్తాము కానీ లొంగే ప్రసక్తి లేదని తాలిబన్లు మొండికేయడంతో అమెరికా యుద్ధమానాలు కుందుజ్, కాంధహార్ లపై బాంబింగ్ ముమ్మరం చేశాయి. మరో వైపు నార్తరన్ అలయెన్స్‌సేనలు కుందుజ్ సరిహద్దు నుంచి తాలిబన్లపై దాడులు చేస్తున్నాయి. కుందుజ్ లో కనీసం 20 వేల మంది తాలిబన్లు పోరాటం సాగిస్తున్నట్లు భాస్తున్నారు. గగనతలం నుంచి అమెరికా యుద్ధమానాల దాడులు, నగరం నాలుగుపైపులా వేలాది మంది నార్తరన్ అలయెన్స్ చుట్టుముట్టడంతో తాలిబన్లు చక్రబంధంలో చిక్కుకున్నారు.
ఆయుధాలుఅప్పగించి లొంగిపోతే క్షమాభిక్ష ప్రసాదిస్తామని నార్తరన్ అలయెన్స్‌సేనల హాdులను తాలిబన్లు నమ్మడం లేదు. దీనితో కుందుజ్ పై ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతునే వున్నది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో సర్కార్ ఏర్పాటుపై చర్చలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications