హైదరాబాద్: తన మంత్రి వర్గాన్ని పునర్వ్యస్థీకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. కొత్త మంత్రులు ఈ నెల 26వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన చెప్పారు.
రెండవ సారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీనియర్లను చాలా మందిని కాదని, కొత్తవారికి మంత్రి వర్గంలో చోటు కల్పించారు. దీంతోసీనియర్లు అలక వహించారు. కె. చంద్రశేఖర్ రావు ఏకంగా పార్టీకి, డిప్యూటీస్పీకర్ పదకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సుతిని ఏర్పాటు చేశారు.అయినా తన మంత్రి వర్గాన్ని ఆయన ఇప్పటి వరకు స్తరించలేదు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై చాలా కాలంగా ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి. మంత్రుల పని తీరును ఆయనఅంచనా వేయడానికి కూడా చర్యలు తీసుకున్నారు. మంత్రులకు గ్రేడ్‌లు ఇచ్చే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ జరుగుతుందనే వార్తతో తెలుగుదేశం శాసనసభ్యుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications
