కుందుజ్ అలయెన్స్ వశం
కాబూల్: కుందుజ్ నగరం నార్తర్న్ అలయెన్స్ వశమైంది. కుందుజ్ నగరంలోని తాలిబాన్‌లు లొంగిపోవడానికి అంగీకరించడంతో కుందుజ్ నగరం శాంతియుతంగా నార్తర్న్ అలయెన్స్ చేతిలోకి వచ్చింది. నార్తర్న్ అలయెన్స్, తాలిబాన్ ముఖ్య నేతల మధ్య మజారే షరీఫ్‌లో జరిగిన కీలక చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
దేశీయులను, ఇతరులను ఆదివారంనాటికిఅప్పగిస్తామని తాలిబాన్ చెప్పింది. దీంతో తాలిబాన్‌లోని దేశీయులు తిరుగుబాటు చేస్తున్నారు. కుందుజ్‌లోని 8వేల మందినార్తర్న్ అలయెన్స్‌కు లొంగిపోతారు. స్వదేశీయులకు క్షమాబిక్ష ప్రసాదిస్తామని, దేశీయులను శిక్షిస్తామని నార్తర్న్ అలయెన్స్ ప్రకటించింది. అయితే, కాందహార్‌ను వదులుకునేది లేదని తాలిబాన్ ప్రకటించింది.అఎn్ఘానిస్థాన్‌ను ముక్కలు చెక్కలు చేయాలనే ప్రయత్నాలను తిప్పి కొడుతామని చెప్పింది.












Click it and Unblock the Notifications
