ముల్లా ఒమర్ వారుసుడు ముల్లాఅక్తర్
క్వయెట్టా: తాలిబాన్ నేత ముల్లా మహ్మద్ ఒమర్ తన సన్నిహిత అనుచరుడిని కొత్త డిప్యూటీగా, తన వారసుడిగా ప్రకటించారు. ఒమర్‌కు ఏమైనా జరిగితే ముల్లాఅక్తర్ మహ్మద్ ఉస్మానీ తాలిబాన్‌కు నాయకత్వం వహిస్తారని పాకిస్థాన్‌కు చెందిన ఇస్లాుక్ ులిటెంట్ గ్రూప్ హర్కత్ ఉల్ ముజాహిదీన్ కమాండర్ అబూ అబ్దుల్ రెహ్మాన్ చెప్పారు. ముల్లా ఉస్వానిని ముల్లా మహ్మద్ ఒమర్ తన వారసుడిగా ఎంపిక చేసుకున్నారని ఆయన చెప్పారు.
ముల్లా ఒమర్, ఉస్మానీలు పాఠశాలలో సహాధ్యాయులు. వారిద్దరు రష్యన్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. దక్షిణాది కాందహార్ ప్రొన్స్‌లోని జామ్యా ఫరూఖ్ ఆజం మద్రాసాలో ఒకేసారి చేరారు. చదువు పూర్తయిన తర్వాతఒకే చోట పాఠాలు చెప్పడం ప్రారంభించారు అని ఆయన చెప్పారు.
ఉస్మానీ ఒమర్‌లాగే ప్రచారం కోసం ఎగబడరని, ఒక సారి మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చారని, అతి అలవాట్లు కూడా అతి సాధారణమైనవని, బ్రెడ్, పండ్లు మాత్రమే తీసుకుంటారని ఆయన చెప్పారు. ఒమర్ కాందహార్‌ను వదిలిపోయినట్లు వచ్చిన వార్తలను రెహ్మాన్ ఖండించారు. ఒమర్ అదే ప్రాంతంలో వున్నారని, అమెరికా బలగాలు ఒమర్‌ను సdుపించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
