వాజ్‌పేయిని కలిసిన భుట్టో
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భారత ప్రధాని వాజ్‌పేయిని కలుసుకున్నారు. ఆమె వాజ్‌పేయితో 30 నిుషాల పాటు సమావేశమయ్యారు. ఆమె ఆదివారంనాడు భారత్‌కు వచ్చారు. నాలుగు రోజుల పాటు భారత్‌లో వుంటారు. ద్వైపాక్షికఅంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలని ఆమె వాజ్‌పేయిని కలుసుకున్న అనంతరం dుడియా ప్రతినిధులతో అన్నారు.
భారత, పాక్‌ల మధ్య సంబంధాలను మెరుగుపరిచే అవకాశాన్ని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ ఆగ్రా సదస్సులో దుర్వ్యినియోగం చేశారని ఆమె దుయ్యబట్టారు. పాకిస్థాన్ ప్రజల చేత ముషారఫ్ ఎన్నిక కాకపోవడమనేది చర్చలకు సంబంధించి తనకు అభ్యంతరమని ఆమె అన్నారు. ప్రజల చేత ఎన్నికయిన నేతల మధ్య అవగాహన కుదిరితే దానికి లువ వుంటుందని ఆమె అన్నారు. అయితే చర్చలు జరగడమనేది సంతోషకరమైన సంగతి అని భుట్టో అన్నారు. కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీతో కూడా ఆమె సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications