11మంది ఇన్‌-8 మంది అవుట్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొత్తగా 11 మందిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అదే సమయంలో 8 మందికి ఉద్వాసన పలికారు. దీంతో ఆయన మంత్రి వర్గ సభ్యుల సంఖ్య మూడుపెరిగింది. పునర్వ్యస్థీకరణ తర్వాత చంద్రబాబునాయుడు మంత్రి వర్గ సభ్యుల సంఖ్య 39కిపెరిగింది. ఇందులో గుంటూరు జిల్లా నుంచి ఇద్దరికి, కరీంనగర్‌ జిల్లా నుంచి ఇద్దరికి స్థానం కల్పించారు. చిత్తూరు జిల్లా నుంచి అనుకున్నట్లుగానే తనకు అత్యంత సన్నిహితుడైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మంత్రిగా తీసుకున్నారు. ఆయన చాలా కాలంగా అసంతృప్తితో వున్నారు. అలాగే గుంటూరు జిల్లా నుంచి ఊహించినట్లుగా డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌కు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు.

నెల్లూరు, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, ప్రకాశం, కడప, జయనగరం జిల్లాల నుంచి ఒకరేసికి మంత్రి పదవులు దక్కాయి. ప్రస్తుతం కొత్తగా మంత్రి పదవులుస్వీకరించినవారందరూ ఇంతకు ముందు మంత్రులుగా పని చేసేవారే కావడం గమనార్హం. మొదటి మంత్రి వర్గంలోనే ఈ పదకొండు మందికి మంత్రి పదవులు దక్కాల్సింది. కానీ కొత్తవారికి అవకాశం ఇచ్చి వారిని చంద్రబాబు పక్కకుపెట్టారు. దాంతో అప్పటి నుంచి సీనియర్‌ శాసనసభ్యులు అసంతృప్తితో వేగి పోతూనే వున్నారు. అప్పుడప్పుడు వారు అసంతృప్తి వెళ్లగక్కుతూ వచ్చినప్పటికీ అది టీ కప్పులో తుఫానేఅయింది. కె. చంద్రశేఖర్‌ రావు తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సుతి (టిఆర్‌ఎస్‌)ని ఏర్పాటు చేశారు.

గుంటూరు జిల్లా నుంచి కొత్తగా ఇద్దరికి మంత్రి వర్గంలో స్థానం కల్పించిన చంద్రబాబునాయుడు ఇద్దరిని తీసేశారు. శనక్కాయలఅరుణ (వైద్య, ఆరోగ్య శాఖ), ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (సాంకేతిక ద్యా మంత్రి) పదవులు కోల్పోయారు. హైదరాబాద్‌ నుంచి ఒకరికి కొత్తగా స్థానం కల్పించి ఒకర్ని తీసేశారు. కార్మిక శాఖ మంత్రిసి. కృష్ణాయాదవ్‌కు ఉద్వాసన పలికారు. చిత్తూరు జిల్లా నుంచి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుని అదే జిల్లాకు చెందిన సమాచార, పౌర సంబంధాల మంత్రి ఎన్‌. శివప్రసాద్‌పై వేటు వేశారు.

కొత్త మంత్రులు

1.సుద్దాల దేవయ్య(కరీంనగర్‌ జిల్లా)
2. ఎస్‌. చంద్రశేఖర్‌ రెడ్డి (నెల్లూరు జిల్లా)
3 డి. ఆంజనేయులు (ప్రకాశం జిల్లా)
4.నారాయణస్వాు (జయనగరం జిల్లా)
5. రామసుబ్బారెడ్డి (కడప జిల్లా)
6. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి (చిత్తూరు జిల్లా)
7. కోడెల శివప్రసాద్‌ (గుంటూరు జిల్లా)
8. జె.ఆర్‌. పుష్పరాజ్‌ (గుంటూరు జిల్లా)
9. ఎం. దామోదర్‌ రెడ్డి (కరీంనగర్‌ జిల్లా)
10. పి. రాములు (మహబూబ్‌నగర్‌ జిల్లా)
11. తలసాని శ్రీనివాస యాదవ్‌ (హైదరాబాద్‌)

మంత్రి పదవులు కోల్పోయినవారు:

1. ఎస్‌.అరుణ (గుంటూరు జిల్లా), వైద్య, ఆరోగ్య శాఖ
2. పుష్పలీల (రంగారెడ్డి జిల్లా), సాంఘిక సంక్షేమ శాఖ
3. ఎన్‌. శివప్రసాద్‌ (చిత్తూరు జిల్లా), సమాచార, పౌర సంబంధాల శాఖ
4. కృష్ణాయాదవ్‌ (హైదరాబాద్‌), కార్మిక శాఖ
5. ఇ. పెద్ది రెడ్డి (కరీంనగర్‌), పర్యాటకాభివృద్ధి శాఖ
6. ఆదాల ప్రభాకర్‌ రెడ్డి (నెల్లూరు జిల్లా), గృహనిర్మాణ శాఖ
7. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ (గుంటూరు జిల్లా), సాంకేతిక ద్యా మంత్రి
8. లక్ష్మీపద్మావతి, (ప్రకాశం జిల్లా), వాణిజ్య పన్నుల శాఖ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+