జస్టిస్ లక్ష్మణన్ పదdస్వీకారం
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరుణాచలం చెట్టియార్ లక్ష్మణన్ సోమవారం నాడు ఉదయం పదd ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ సి రంగరాజన్ జస్టిస్ లక్ష్మణన్‌తో ప్రమాణం చేయించారు. జస్టిస్ లక్ష్మణన్ దేవుడిపేరుdుద పదd స్వీకార ప్రమాణాన్ని చేశారు.
అంతకు ముందు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ యతిరాజులు జస్టిస్ లక్ష్మణన్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన నోటిఫికేషన్‌ను సభకు నిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్టమంత్రులు దేవేందర్‌గౌడ్, అశోక్‌గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, కరణం రామచంద్రరావు, చిక్కాల రామచంద్రరావు, దండు శివరామరాజు, పి చంద్రశేఖర్, జయరామారావు, మణికుమారి, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు అధికారులు, న్యాయవాదులుహాజరయ్యారు.












Click it and Unblock the Notifications