హోమ్ పేజి
హైదరాబాద్‌ః రాష్ట్ర మంత్రివర్గాన్ని భారీగా పునర్‌వ్యవస్థీకరించిన ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు మంత్రుల శాఖల్లో కూడా మార్పు చేర్పులు చేశారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన కోడెల శివప్రసాదరావుకు పౌర సరఫరాలు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఉపాధి కల్పన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. ఐటి శాఖను ఈ సారే కొత్తగా ఏర్పాటు చేశారు.
రామసుబ్బారెడ్డికి హౌసింగ్, పతివాడ నారాయణస్వాు నాయుడుకు చక్కెర శాఖఅప్పగించారు. శనక్కాయల అరుణ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖను ఎన్ జనార్ధన్‌రెడ్డికిఅప్పగించారు. జాగర్లమూడి లక్ష్మీపద్మావతిని తొలగించడంతో ఖాళీఅయిన వాణిజ్య పన్నుల శాఖను జయరామారావుకుఅప్పగించారు. రోడ్లు భవనాల శాఖను తుమ్మలకుఅప్పగించారు.
పుష్పలీలకు ఉద్వాసన పలికిన కారణంగా ఖాళీఅయిన సాంఘీక సంక్షేమ శాఖను జెఆర్ పుష్పరాజ్‌కుఅప్పగించారు. క్రీడల శాఖ మంత్రిగా వున్న తు్మనేనిసీతారామ్‌కు ఎక్సైజ్ శాఖను అప్పగించారు. కడియం శ్రీహరికి భారీ మధ్యతరహా నీటి పారుదల శాఖలనుఅప్పగించారు. శ్రీహరి ఇంతకాలం చూసిన పాఠశాల ద్య మండవ వెంకటేశ్వరరావుకుఅప్పగించారు. సాంకేతిక ద్యాశాఖ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను తొలగించి ఆ బాధ్యతలను ముద్దసాని దామోదర్‌రెడ్డికిఅప్పగించారు. చిత్తూరుకు చెందిన శివప్రసాద్ స్థానంలో సమాచార ప్రసార శాఖల బాధ్యతలను సోురెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కేటాయించారు. దామచర్ల ఆంజనేయులుకి మార్కెటింగ్, సుద్దాల దేవయ్యకు కార్మిక శాఖను కేటాయించారు. నగరం నుంచి మంత్రివర్గంలోకి మరోసారి ప్రవేశించిన శ్రీనివాస యాదవ్‌కు టూరిజం, సాంస్కృతిక శాఖలనుఅప్పగించారు.












Click it and Unblock the Notifications