పొటోపై ప్రధాని అఖిలపక్షం: అద్వానీ
న్యూఢిల్లీ: తీవ్రవాద వ్యతిరేక ఆర్డినెన్స్(పొటో)పై ఏకాభిప్రాయ సాధన కోసం ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కన్సల్టేటివ్ కుటీ సమావేశంలో హోం మంత్రి ఎల్.కె. అద్వానీ సోమవారం ఈ సంగతి చెప్పారు. అయితే అఖిల పక్ష సమావేశం ఎప్పుడు జరిగేది ఆయన ప్రకటించలేదు.
ప్రతిపక్షాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకున్నదని, అన్ని పార్టీలను ప్రదాని సంప్రదించిన తర్వాత పొటోపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రస్తుత రూపంలో పొటోనుఅంగీకరించేది లేదని కాంగ్రెస్ నాయకులు శివరాజ్ పాటిల్, గులాం నబీ ఆజాద్ సమావేశంలో చెప్పినట్లు బిజెపి నాయకుడు మదన్‌లాల్ ఖురానా లేకరులతో చెప్పారు. ఖురానా కూడా సమావేశానికిహాజరయ్యారు. పత్రికా స్వేచ్ఛను దెబ్బ తీసేఅంశాల వంటివాటిని పోటో నుంచి తొలగించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని ఆయన అన్నారు. పొటోను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని సిపిఎం నాయకుడు సోమనాథ్ ఛటర్జీ చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులతో పాటు ముస్లింలీగ్ నాయకుడు జి.ఎం. బనట్వాల కూడా ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications